టెలికం కంపెనీలంటే మనకు తెలిసిందల్లా టారిఫ్లు, ఆఫర్లు, ఒకరిమీద ఒకరు పోటీపడి ఛార్జీలు పెంచడం లేదంటే ఛార్జీలు తగ్గించడం, మా నెట్వర్క్ గొప్పంటే మాది గొప్పంటూ డప్పు కొట్టుకోవడం.. ఇంతవరకూ ఇదే చూశాం. కానీ ఫస్ట్టైమ్ సమాజం కోసం మన టెల్కోలు నడుం కట్టాయి. ప్రపంచాన్ని వణికిస్తూ ఇండియాను మొత్తం ఇంట్లో పెట్టి తాళం వేసిన కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలకు అండగా నిలబడుతున్నాయి. స్టే హోమ్.. బీ కనెక్టెడ్ అంటూ జనాన్ని సిద్ధం చేస్తున్నాయి. అందుకు తగ్గట్లు ఉచిత కాల్స్, డేటాతోపాటు రకరకాలుగా తమ వంతు సాయం అందిస్తున్నాయి.
కాలర్ ట్యూన్తో షురూ
కొవిడ్-19 (కరోనా) వైరస్పై అవగాహన పెంచేందుకు టెలికం సంస్థలు కాలర్ ట్యూన్ను మార్చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి, లక్షణాలేంటి? వస్తే ఏం చేయాలి వంటివన్నీ దాదాపు 45 సెకన్ల కాలర్ ట్యూన్గా పెట్టి యూజర్లందరినీ అప్రమత్తం చేశాయి. నిజం చెప్పాలంటే దేశంలో కరోనా విజృంభించకముందే దాని గురించి జనాలకు బాగా తెలిసింది ఈ కాలర్ ట్యూన్ వల్లే.
డిస్ప్లే కూడా మార్చేశాయి
ఇప్పుడు యూజర్లలో వైరస్పై మరింత అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియాలు తమ నెట్వర్క్ డిస్ప్లేను మార్చేశాయి. వొడాఫోన్ ఐడియా తన నెట్వర్క్ డిస్ప్లేను ‘వొడాఫోన్-బి సేఫ్’ అని మార్చింది. బీఎస్ఎన్ఎల్ తన డిస్ప్లేను ‘బీఎస్ఎన్ఎల్ స్టే ఎట్ హోం’ అని పెట్టింది.
ప్రీపెయిడ్ గడువు పెంపు.. ఫ్రీ టాక్టైమ్
ఈ నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. నిత్యవసరాల వస్తువులు తప్ప మిగతావి అమ్మే షాపులన్నీ బంద్. అందుకే ప్రీపెయిడ్ గడువు ముగిసినా కస్టమర్లకు ఈ నెల 17 వరకు ఇన్కమింగ్ గడువు పెంచాయి టెల్కోలు. ఉచితంగా టాక్టైం కూడా ఇస్తున్నాయి.
* ఎయిర్టెల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు కాలపరిమితిని ఏప్రిల్ 17 వరకూ పొడిగించింది. పది రూపాయాల టాక్టైమ్ను జత చేసింది.
* ఐడియా తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీని ఈ నెల 17 వరకు పొడిగించింది. ఉచితంగా పది రూపాయల టాక్టైంను కూడా జోడించింది.
* బీఎస్ఎన్ఎల్ కూడా ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీని పెంచడమే కాకుండా 10 టాక్టైంను ఉచితంగా ఆఫర్ చేసింది. అలాగే వర్క్ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు 10 ఎంబీపీఎస్ డౌన్ స్పీడ్తో రోజుకు 5జీబీని ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది.
జియో 100 నిమిషాలు 100 SMSలు ఉచితం
ఇక రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల టాక్టైమ్, 100 ఎస్ఎమ్ఎస్లను ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇన్కమింగ్ కాల్స్ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించింది.
Airtel Carona offers Vodafone idea carona offers Carona Virus Covid-19 Jio free talk time Jio Carona offer  క‌రోనా వైర‌సà±â€Œ కొవిడà±â€Œ-19 వైర‌సà±â€Œ క‌రోనాపై టెలికం కంపెనీల పోరౠక‌రోనా కాల‌రౠటà±à°¯à±‚à°¨à±â€Œ à°«à±à°°à±€ టాకà±â€Œà°Ÿà±ˆà°®à±â€Œ ఎయిరà±â€Œà°Ÿà±†à°²à± క‌రోనా ఆఫ‌రà±â€Œ జియో క‌రోనా ఆఫ‌రà±â€Œ